Header Banner

ఆటో స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. సభకు ప్రత్యేక ఆకర్షణగా! శిల్పాలకు ప్రశంసల జల్లు!

  Wed Apr 30, 2025 16:15        Politics

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రభాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. మే 2న పునర్నిర్మాణ పనులకు మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని సభ వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఆయన ప్రత్యేక విగ్రహాన్ని తిలికించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆటో మొబైల్ స్క్రాప్‌తో చేసిన మోదీ విగ్రహంతో పాటు వెలకమ్ అమరావతి లెటర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఒక స్టాండ్ ఏర్పాటు చేశారు. తెనాలికి చెందిన సూర్య శిల్ప శాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరావు ఆయన తనయులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన మోడీ విగ్రహం కూడా ఉంది.

ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే నట్టులు, బొల్టుల సాయంతో ఎత్తైన విగ్రహాలు తయారు చేశారు. ప్రముఖుల విగ్రహాలతో పాటు బైసన్, జీపు, సింహం, సైకిల్ వంటి వస్తువులను స్క్రాప్ తో తయారు చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా లక్షలు ఖర్చు చేసి అనేక విగ్రహాలను తయారు చేశామని వాటిన సభ వద్ద ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతి తీసుకున్నట్లు వెంకటేశ్వరావు తెలిపారు. సభ వద్ద మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్ తో పాటు తెలుగు దేశం పార్టీ సింబల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు అమరావతి పేరును కూడా తీగతో ఆకట్టుకునేలా రూపొందించారు. వీటన్నింటిని సభకు వచ్చే ప్రముఖులతో పాటు ఇతరులు తిలకించాలనేది తమ కోరిక అని శిల్పి రవిచంద్ర తెలిపారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పెట్టిందిపేరని గతంలోనూ అనేక అవార్డులు పొందినట్లు శిల్పులు తెలిపారు. మోడీ తో పాటు ఇతరలు విగ్రహాలను ఆకట్టుకునేలా రూపొందించిన శిల్పులను పలువురు అభినందిస్తున్నారు.


ఇది కూడా చదవండి: విశాఖ కేజీహెచ్ ఘటనపై అనిత ఫైర్‌.. తప్పు చేస్తే క్రిమినల్ కేసులే! బాధితులకు తక్షణ సాయం హామీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ModiSculpture #AutoScrapArt #AmaravatiEvent #ModiInAP #ScrapArt #ArtisticInnovation #ModiVisit